పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే హవా: వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడి

Published : Jan 05, 2019, 08:50 PM IST
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే హవా: వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడి

సారాంశం

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తుందా..? 17 లోక్ సభ స్థానాలకు గానూ 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందా....అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్వీప్ చెయ్యనుందా...అంటే అవుననే చెప్తోంది వీడీపీ అసోషియేట్స్ సర్వే సంస్థ.  

హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తుందా..? 17 లోక్ సభ స్థానాలకు గానూ 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందా....అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్వీప్ చెయ్యనుందా...అంటే అవుననే చెప్తోంది వీడీపీ అసోషియేట్స్ సర్వే సంస్థ.

 రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 44.4 శాతం ఓట్లు రాబడుతోందని వీడీపీ అసోషియేట్స్ సర్వే సంస్థ తెలిపింది. 16 లోక్‌సభ స్థానాలలో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు వీడీపీ తెలిపింది. మిగిలిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం గెలుచుకోనున్నట్టు వెల్లడించింది. 

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు ఖాతా తెరిచే అవకాశం లేదని సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ 31 శాతం, బీజేపీ 11.4 శాతం, ఎంఐఎం 4 శాతం, టీడీపీ 3 శాతం, సీపీఎం 0.5 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్లు వీడీపీ అసోసియేట్స్ స్పష్టం చేసింది. 4 శాతం మంది ఓటర్లు నోటాకు ఓటు వేయనున్నట్లు స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?