బీబీ నగర్‌ ఎయిమ్స్‌లో డెలివరీలు జరగడం లేదు.. : కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

Published : Aug 03, 2022, 01:57 PM IST
బీబీ నగర్‌ ఎయిమ్స్‌లో డెలివరీలు జరగడం లేదు.. : కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీబీ నగర్ ఎయిమ్స్ గురించి కిషన్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడారని హరీష్ రావు అన్నారు. కానీ.. బీబీ నగర్ ఎయిమ్స్‌లో ఒక్క సర్జరీ లేదు.. డెలివరీ లేదని చెప్పారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీబీ నగర్ ఎయిమ్స్ గురించి కిషన్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడారని హరీష్ రావు అన్నారు. కానీ.. బీబీ నగర్ ఎయిమ్స్‌లో ఒక్క సర్జరీ లేదు.. డెలివరీ లేదని చెప్పారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో పేదలకు వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో చేరిన వైద్య విద్యార్థులు బాధపడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వమే ఎయిమ్స్ స్థాయిని దిగజార్చిందని విమర్శించారు. ఎయిమ్స్ పక్కనే ఉన్న పీహెచ్‌సీలో 11 డెలివరీలు జరిగాయని చెప్పారు. అలాంటిది ఎయిమ్స్‌లో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. 

ఎయిమ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని ఆరోపించారని.. అయితే ఆధారాలు చూపిస్తే నోట మాట రాలేదని హరీష్ రావు అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌ను కిషన్ రెడ్డి చూసి వెళ్లారు కానీ.. తెచ్చిందేమీ లేదని విమర్శించారు. 

ఇక,కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌కు కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. షేకావత్ గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరానికి కేంద్రమే అన్ని అనుమతులు ఇచ్చిందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?