హైదరాబాద్ జలవిహార్ లో.. హరికృష్ణ దశదిన కర్మ

By ramya neerukondaFirst Published 8, Sep 2018, 2:45 PM IST
Highlights

ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన హరికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
 

సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ దశదిన కర్మలను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని జలవిహార్ లో నిర్వహించారు. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన హరికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో హరికృష్ణ కుమారులు  కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, సోదరి పురందరేశ్వరి, మరికొందరు నందమూరి కుటుంబ సభ్యులు, హరికృష్ణ బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ పాల్గొన్నారు. వీరితో పాటు హీరో నాగార్జున, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్, నందమూరి కుటుంబానికి సన్నిహితులైన పలువురు సినీ, రాజకీయ రంగాల సన్నిహితులు హాజరయ్యారు.

Last Updated 9, Sep 2018, 12:47 PM IST