అక్రమ సంబంధం.. ఫిర్యాదు చేసినందుకు భర్తకు.. భార్యతో దిగిన అశ్లీల చిత్రాలతో వేధింపులు

Published : Sep 20, 2018, 11:17 AM IST
అక్రమ సంబంధం.. ఫిర్యాదు చేసినందుకు భర్తకు.. భార్యతో దిగిన అశ్లీల చిత్రాలతో వేధింపులు

సారాంశం

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు భర్తపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు భర్తపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన గిరి శ్రీనివాస్ గౌడ్ అనే యువకుడు చదువుకుంటున్న సమయంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు.

ఈ సమయంలో ఆ ఇంటికి సమీపంలోని వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే వీరిద్దరి విషయం తెలుసుకున్న వివాహిత భర్త ఇంటిని ఖాళీ చేసి తన స్వగ్రామానికి మకాం మార్చాడు. అయినప్పటికీ శ్రీనివాస్ తన పద్దతి మార్చుకోకుండా ఆమెతో తన బంధాన్ని కొనసాగించాడు.

దీంతో వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ అతని భార్యతో తాను సన్నిహితంగా, అసభ్యకర రీతిలో తీసుకున్న ఫోటోలను వాట్సాప్‌లోని గ్రూపులలో షేర్ చేశాడు.

వీటిని చూసిన భర్త అతని కుటుంబసభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీనిపై మరోసారి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్