ఇది మరో ప్రణయ్-అమృతల కథ.. ఆలస్యంగా వెలుగులోకి

Published : Sep 20, 2018, 11:11 AM IST
ఇది మరో ప్రణయ్-అమృతల కథ.. ఆలస్యంగా వెలుగులోకి

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఆమె తండ్రి తన నుంచి దూరం చేయడంతో సంతోషనర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

మిర్యాలగడ పరువు హత్యతో.. అలాంటి సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదు రోజుల క్రితం తక్కువ కులస్తుడిని ప్రేమించిందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ఆమె భర్త ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు షాక్ కి గురయ్యాయి. ఆ విషాద ఛాయలు ఇంకా మరవకముందే మంగళవారం హైదరాబాద్ నగరంలో మరో సంఘటన చోటుచేసుకుంది.

కూతరు, అల్లుడుపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు ఓ వ్యక్తి. కాగా.. ఇలాంటిదే మరోకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కాకపోతే ఇక్కడ దాడి జరగలేదు కానీ.. ప్రేమికులను విడదీశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఆమె తండ్రి తన నుంచి దూరం చేయడంతో సంతోషనర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన శ్రీకాంత్.. ఓ యువతిని మూడు సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కాగా.. అతనిది తక్కువ కులం అని తెలియడంతో.. ఆమె తల్లిదండ్రులు యువతిని శ్రీకాంత్ కి దూరం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీకాంత్  ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్