హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ :హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కవిత పేర్కొన్నారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై సస్పెన్షన్ వేటేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ విషయమై విచారణ చేసి నిందిథులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమాచారం ఇచ్చారు.
అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU
— V Srinivas Goud (@VSrinivasGoud)
undefined
నిబంధనలకు విరుద్దంగా స్పోర్ట్స్ స్కూల్ లో బాలికల పట్ల సదరు అధికారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేశారు. బాలికల హస్టల్ కు అధికారి రాత్రిపూట వచ్చి వేధింపులకు దిగేవాడనే ఆరోపణలున్నాయి. స్పోర్ట్స్ స్కూల్ లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో కూడ ఆ అధికారి రాసలీలలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడ ఉన్నాయి. ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి.
సాయంత్రం పూట స్పోర్ట్స్ స్కూల్ లో ఉండే బాలికలను కారులో ఆటవిడుపు కోసం తీసుకెళ్లేవాడనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ స్పోర్ట్స్ స్కూల్ లో శిక్షణ పొందేందుకు ఉన్న బాలికలు తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు. ఈ విషయాలపై ఆ అధికారిపై ఎవరూ కూడ ప్రశ్నించే పరిస్థితి లేదని బాధితులు చెబుతున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ తరహా ఘటనలను ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఢిల్లీలోని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజర్లు ఆరోపణలు చేశారు. ఈ విషయమై మహిళా రెజ్లర్లు ఆందోళనలు కూడ చేశారు. రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదైన విషయం తెలిసిందే.