తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు

Published : Mar 13, 2022, 12:13 PM ISTUpdated : Mar 13, 2022, 02:13 PM IST
తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు

సారాంశం

తెలంగాణ శాసన మండలి చైర్మెన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కూడా  కూడా తెలంగాణ శాసన మండలి చైర్మెన్ ‌గా  పనిచేశారు.


హైదరాబాద్: Telangana శాసనమండలి చైర్మెన్ పదవికి Gutha Sukhendar Reddy ఆదివారం నాడు nomination దాఖలు చేశారు. గతంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి legislative  Council ఛైర్మెన్ గా పనిచేశారు. ఈ పదవీ కాలం ముగియడంతో  మరో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత సుఖేందర్ రెడ్డి ఈ పదవికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.

 మంత్రి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌,  ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, ,మెతుకు ఆనంద్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు. మాజీ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు.

ఈ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు,విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు,దామోదర్ రెడ్డి,గంగాధర్ గౌడ్,ఎగ్గే మల్లేశం,రఘోత్తమ రెడ్డి,జనార్దన్ రెడ్డి,దండే విఠల్, నవీన్ కుమార్,బస్వరాజ్ సారయ్య,బండ ప్రకాష్, శేరి శుభాష్ రెడ్డి,కడియం శ్రీహరి,ఎమ్మెల్యేలు భాస్కర్ రావు,భూపాల్ రెడ్డి,జీవన్ రెడ్డి,మెతుకు ఆనంద్,మల్లయ్య యాదవ్,ఏం పి బడుగుల లింగయ్య యాదవ్,రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

2019 సెప్టెంబర్ 11వ తేదీన  తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి తొలి సారిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కూడా ఒక్క నామినేషన్ దాఖలైంది. దీంతో సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గత ఏడాది నవంబర్ మాసంలో  ఆరుగురు ఎమ్మెల్సీలను కేసీఆర్ ఫైనల్ చేశారు. 

గత ఏడాది జూన్ మాసంలో గుత్తా సుఖేంద్ రెడ్డి పదవీకాలం ముగిసింది.  దీంతో గత ఏడాది నవంరబ్ లో  కేసీఆర్ సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

సుఖేందర్ రెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో  ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్‌ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్‌ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలిలోని ఖాళీలన్నీ భర్తీకావడంతో తాజాగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు ప్రకటన వెలువడింది.

కొత్త ఛైర్మన్ ఎంపికకు సంబంధించి గవర్నర్ కు సమాచారం ఇచ్చిన మండలి అధికారులు.నూతన ఛైర్మన్ ఎంపికకు సంబంధించి అనుమతి తీసుకున్నారు. అయితే, అధికార పార్టీకి మండలిలో మెజార్టీ ఉంది.శనివారం నాడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్  లో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ  శాసనమండలి చైర్మెన్ విసయమై చర్చించారు.

సుఖేందర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో  మంత్రివర్గంలోకి తీసుకొంటారనే చర్చ కూడా జరిగింది. అయితే శాసమండలి చైర్మెన్ పదవికి సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో  ఆయనకు కేబినెట్ లో ఛాన్స్ లేదని తేలిపోయింది.గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి ఆయన టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu