గురుకులాల్లో ఇంటర్మీడియెట్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు ఆహ్వానం

By Mahesh KFirst Published Jan 25, 2023, 7:13 PM IST
Highlights

తెలంగాణ గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా  సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
 

హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ, సాంఘిక గురుకులాల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఆసక్తి గల ఇంటర్మీడియెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వీరి నుంచి టీజీయూజీసీఈటీ 2023కు దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు సిరిసిల్ల (మహిళల) స్పెషల్ కాలేజీ ఆఫ్ డిజైన్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాల (పురుషుల) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. 

Also Read: బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ముహూర్తం ఫిక్స్.. దసరాకు ప్రారంభమవ్వాలి: 32 బీసీ కుల సంఘాలతో మంత్రి గంగుల

ఈ రెసిడెన్షియల్ కాలేజీలు అత్యుత్తమ జాతీయ, అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. మల్టీ నేషనల్ కంపెనీల్లో నియామకాలను నిర్దారిస్తున్న డేటా సైన్స్ వంటి శిక్షణ కార్యక్రమాలను కూడా అందిస్తాయని వివరించింది. 

ఈ కాలేజీల్లో దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల 5వ తేదీ అని పేర్కొంది.

click me!