టీఆర్ఎస్ లో కేసీఆర్ దే తుది నిర్ణయం.. గుండు సుధారాణి

Published : Sep 25, 2018, 04:52 PM IST
టీఆర్ఎస్ లో కేసీఆర్ దే తుది నిర్ణయం.. గుండు సుధారాణి

సారాంశం

కొండా దంపతులు ఒంటెద్దు పోకడలు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అని తెలిపారు. 

టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని ఆ పార్టీ నేత గుండు సుధారాణి పేర్కొన్నారు. అదే పార్టీకి చెందిన కొండా సురేఖ దంపతులు.. టీఆర్ఎస్ లో గ్రూపులు ఉన్నాయని, తాము హరీష్ రావు వర్గమని పేర్కొన్న సంగతి తెలిసిందే. అవేవిధంగా పార్టీ అధినేత కేసీఆర్ పై కూడా కొండా సురేఖ దంపతులు పలు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నేతలు స్పందించగా.. తాజాగా మరో నేత స్పందించారు.

మంగళవారం ఈ విషయంపై గుండు సుధారాణి మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమకారులపై దాడులు జరిపించిన చరిత్ర కొండా సురేఖ దంపతులదని సుధారాణి ధ్వజమెత్తారు. 

అభద్రతాభావంతో నే  కొండా సురేఖ, మురళి ఇలా మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. కొండా దంపతులు ఒంటెద్దు పోకడలు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో వర్గాలు ఉన్నాయని కొండా దంపతులు ఆరోపిస్తున్నారని..కానీ అది నిజం కాదని ఆమె పేర్కొన్నారు.

 టీఆర్‌ఎస్‌లో  ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు.  టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌దే తుది నిర్ణయమని తేల్చిచెప్పారు.  జయశంకర్ సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు కొండా దంపతులు అని సుధారాణి పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu