కుంభకోణాల్లో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్: దత్తాత్రేయ

Published : Sep 25, 2018, 04:02 PM IST
కుంభకోణాల్లో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్: దత్తాత్రేయ

సారాంశం

టీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌: టీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న దత్తాత్రేయ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేయని కుంభకోణమంటూ లేదని ఆరోపించారు. 

ఇప్పుడు టీఆర్ఎస్ కూడా చేయని కుంభకోణమంటూ ఏమీ లేదని దత్తాత్రేయ అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ తేడా ఏమీ లేదన్నారు. పేదల ఆరోగ్యం కోసం మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్‌భవ పథకాన్ని ప్రవేశపెడితే కేసీఆర్‌ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు సీట్లే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిందని వచ్చే ఎన్నికల్లో ఆ కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?