తల లేని మొండెం కేసు.. నాలుగు రోజుల పాటు గాలింపు, ఎట్టకేలకు పోలీసులకు దొరికిన మొండెం

By Siva KodatiFirst Published Jan 13, 2022, 7:09 PM IST
Highlights

నల్గొండ జిల్లాలో ( nalgonda district) అమ్మవారి దేవాలయం వద్ద మొండెం లేని తల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎట్టకేలకు మొండాన్ని కనుగొన్నారు. తర్కయాంజల్‌లోని ఓ భవనంలో మొండెం లభించింది. తలను వేరు చేసి మొండాన్ని భవనంలో దాచారు దుండగులు. 

నల్గొండ జిల్లాలో ( nalgonda district) అమ్మవారి దేవాలయం వద్ద మొండెం లేని తల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎట్టకేలకు మొండాన్ని కనుగొన్నారు. తర్కయాంజల్‌లోని ఓ భవనంలో మొండెం లభించింది. తలను వేరు చేసి మొండాన్ని భవనంలో దాచారు దుండగులు. నిర్మాణంలో వున్న భవనంలో మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడిని సూర్యాపేటలోని శూన్యపహాడ్‌కు చెందిన నాయక్‌గా గుర్తించారు. 

కాగా.. గొల్లపల్లి గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల mettu Mahankali అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి హతుడి వివరాలను  కనుగొన్నారు.

హతుడిని సూర్యాపేట జిల్లా (suryapet district) పాలకవీడు మండలం శూన్యంపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) గా తండ్రి శంకర్ నాయక్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని తెలిపారు.

ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న 
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మూఢనమ్మకాలతో ఎవరైనా నరబలి ఇవ్వడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

click me!