Revanth Reddy : తెలంగాణ సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి

By Arun Kumar P  |  First Published Dec 12, 2023, 6:58 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెెడ్డి తన టీమ్ ను తయాారుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎం కార్యాలయ బాధ్యతలు కొత్తవారికి అప్పగించిన రేవంత్ తాజాగా చీఫ్ సెక్యూరిటీ అధికారిని కూడా మార్చారు. 


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్ర యాంటి నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా వున్న చక్రవర్తిని తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తూ రాష్ట్ర డిజిపి రవిగుప్తా ఉత్తర్వులు జారీచేసారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని... తదుపరి ఆదేశాలు వెలువడేవరకు సీఎం సెక్యూరిటీ బాధ్యతలు చక్రవర్తి చూసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

 

Latest Videos

ఇక ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి శివధర్ రెడ్డిని సీఎం రేవంత్ నియమించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి నియమితులయ్యారు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీమ్ ను తయారుచేసుకుంటున్నారు.

ఇదిలావుంటే త్వరలోనే రేవంత్ సర్కార్ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా వుండే పోలీస్ అధికారులకు కీలక బాధ్యతలు దక్కాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటోందంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఈసీకి కూడా ఫిర్యాదుచేసారు. స్వయంగా రేవంత్ రెడ్డి సైతం కొంతమంది పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారు. 

Also Read  Prajavani : ప్రజాదర్బార్‌ ఇకపై ప్రజావాణి.. ఆ రెండు రోజుల్లో నిర్వహించాలని సీఎం ఆదేశం..

ఇలా బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులపై రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోనుంది. త్వరలోనే హోంశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రేవంత్ భావిస్తున్నారని... అందుకోసమే ఆ శాఖను తనవద్దే పెట్టుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. గతంలో కాంగ్రెస్ నాయకులను ఇబ్బందిపెట్టిన పోలీస్ అధికారులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని రేవంత్ హెచ్చరించారు... ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎవరిపై ఎలాంటి చర్యలు వుంటాయోనని పోలీసుల్లో గుబులు మొదలయ్యిందట. 

ఓ సామాజిక వర్గానికి చెందిన పోలీసులకు ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నాు. అప్పుడు అధికారంలో వున్న బిఆర్ఎస్ తమ ఎమ్మెల్యేల సిఫారసులతోనే పోలీసుల బదిలీలు చేపట్టినట్లు తాజా ప్రభుత్వం గుర్తించింది.తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ తమ నియోజకవర్గ పరిధిలో బదిలీలు చేయించుకున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇలా బిఆర్ఎస్ కు అనుకూలంగా జరిగిన బదిలీలు,  బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటి అధికారుల తీరుపై ఉన్నత స్థాయిలో విచారణ చేయాలంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.ఈ విచారణ నివేదిక తరువాత పోలీసు శాఖలో భారీ ఎత్తున బదిలీలు ఉండే అవకాశాలున్నాయి. 


 

click me!