మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ముగిసిన జీఎస్టీ, ఐటీ సోదాలు

By narsimha lode  |  First Published Dec 13, 2022, 9:26 AM IST

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలో జీఎస్టీ, ఐటీ అధికారుల సోదాలు  మంగళవారం నాడు తెల్లవారుజామున ముగిశాయి. సోమవారం నాడు ఉదయం నుండి  ఈ సోదాలు ప్రారంభమయ్యాయి.


హైదరాబాద్: మైత్రీ మూవీ మేకర్స్  సంస్థ  కార్యాలయంలో జీఎస్టీ , ఐటీ అధికారుల సోదాలు  ముగిశాయి.  సోమవారంనాడు  ఉదయం నుండి  మంగళవారంనాడు తెల్లవారుజాము  వరకు  ఈ సోదాలు నిర్వహించారు.పలు హిట్ సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.  శ్రీమంతుడు, పుష్ప, సర్కార్ వారి పాట,జనతా గ్యారేజీ వంటి సినిమాలను ఈ సంస్థ నిర్మించింది. చిరంజీవి హీరోగా  వాల్తేరు వీరయ్య,  బాలకృష్ణ హీరోగా  వీరసింహారెడ్డి, అల్లు అర్జున్ హీరోగా పుష్ప-2 , పవన్ కళ్యాణ్ హీరోగా  ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను ఈ నిర్మాణ సంస్థ  ప్రస్తుతం నిర్మిస్తుంది.  సోమవారం నాడు ఉదయం నుండి జీఎస్టీ, ఐటీ అధికారులు సంయుక్తంగా  సోదాలు  నిర్వహించారు.  అేంతకాదు నిర్మాతలుగా  ఉన్న యలమంచిలి రవి,  ఎర్నేని నవీన్  ఇళ్లలో కూడా  జీఎస్టీ,  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలో  కీలక పత్రాలను, హర్డ్ డిస్క్ లను అధికారులు సీజ్  చేశారు.  పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాను  ఈ నెల 11నే ప్రారంభించారు. మరునాడే జీఎస్టీ, ఐటీ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలునిర్వహించడం గమనార్హం.

click me!