తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారు.. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో వివరాలు..

By SumaBala BukkaFirst Published Jan 19, 2023, 9:42 AM IST
Highlights

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఎలా ఉండబోతోందో ఎట్టకేలకూ ఖరారయ్యింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో వివరాలు పొందుపరిచారు. 

హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించబోతున్న మొదటి గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష విధానం ఫైనల్ అయింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మెయిన్స్ పరీక్ష విధానం వివరాలను ఈ మేరకు అందుబాటులో ఉంచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షా విధానానికి నిపుణుల కమిటీ సూచన మేరకు ఆమోదం తెలిపింది. మెయిన్స్ పేపర్ ఎలా ఉంటుందో తెలిపే విధానం.. పేపర్లోని సెక్షన్ల వివరాలు..  ఛాయిస్ ప్రశ్నలు.. ఇలాంటి అనేక వివరాల కోసం టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ని సందర్శించవచ్చని  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగార్థులకు సూచన చేసింది.

దీంతోపాటు  తెలంగాణలో మరో 783 గ్రూప్ టు పోస్టుల భర్తీకి టీఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.  గ్రూప్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ ముందుగా చెప్పినట్టుగానే నేటి నుంచి అంటే జనవరి 19నుంచి ప్రారంభమయ్యింది. నేటి నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సి తెలిపింది.  

'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్ .. మెయిన్స్‌ ఎప్పుడంటే?

అయితే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఓటిఆర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు కోసం చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని.. వీలైనంత తొందరగా అప్లై చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థులకు సూచించింది.

click me!