ఆరు నెలలోపుగా ఆ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలి: జీఆర్ఎంబీ

By narsimha lodeFirst Published Sep 17, 2021, 5:02 PM IST
Highlights

అనుమతులు లేని ప్రాజెక్టులు ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది.జీఆర్ఎంబీ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది.

హైదరాబాద్: అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు నెలల లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది.జలసౌధలో జీఆర్ఎంబీ ఉపసంఘం హైద్రాబాద్ లో భేటీ అయింది. జలసౌధలో  
జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశమైంది.  

తెలుగు రాష్ట్రాల అధికారులతో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీలోపుగా గెజిట్ నోటిఫికేషన్  అమలుకు సహకరించాలని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులను జీఆర్ఎంబీ కోరింది.ప్రాజెక్టుల నిర్వహణకు వారం, పది రోజుల్లో సిబ్బంది వివరాలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను బోర్డు ఆదేశించింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించేందుకు గాను ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై గెజిట్ విడుదల చేసింది.రెండు తెలుగు రాష్ట్రాలు నీటి వాటాల విషయంలో పరస్పరం ఫిర్యాదు చేసుకొంటున్నాయి. కృష్ణాతో పాటు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు తమ వాదనను సమర్ధించుకొంటున్నాయి.
అంతేకాదు ప్రాజెక్టుల నిర్మాణంపై కూడ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి.

click me!