తెలంగాణ విమోచన దినం :నిర్మల్‌ సభలో ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 17, 2021, 4:48 PM IST
Highlights

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు డిమాండ్ చేశామని రాజేందర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం దుర్దినమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జండా కాషాయ జెండానేనన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి పాలొన్నారు ఈటల. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు డిమాండ్ చేశామని రాజేందర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం దుర్దినమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ALso Read:విమోచన దినోత్సవం .. కేసీఆర్ ఎవరికో భయపడుతున్నారు, మజ్లిస్‌కు బీజేపీ భయపడదు : అమిత్ షా

ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మరోసారి డిమాండ్ చేస్తున్నానని… . 2023 లో భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో విజయదుందుభి మోగించి సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతుందని ఈటల స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం లేదని.. ప్రజాస్వామ్య సాంప్రదాయాల విలువలు లేవని ఆయన ఆరోపించారు. అక్కడ ఏం జరుగుతుందో మీరంతా గమనిస్తూనే ఉన్నారని రాజేందర్ వివరించారు. కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా… గెలుపు బీజేపీ పార్టీదేనని గెలుపమని ఈటల జోస్యం చెప్పారు,
 

click me!