జీవన్ రెడ్డి గెలుపు: మూడు చోట్ల టీఆర్ఎస్ కారుకు బ్రేకులు

By Siva KodatiFirst Published Mar 27, 2019, 8:49 AM IST
Highlights

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

వరంగల్-ఖమ్మం- నల్గోండ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 22న పోలింగ్ జరిగింది.

మంగళవారం ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు సాధారణ ఎన్నికల్లో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అగ్రనేతలతో తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించాయి.

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. సీపీఎం బలపరిచిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు.

మొత్తం 18,885 ఓట్లు పోలవ్వగా, నర్సిరెడ్డికి 8,976 ఓట్లు.. పూల రవీందర్‌కు 6,279 ఓట్లు పోలయ్యాయి. రవీందర్‌కు టీఆర్ఎస్ మద్ధతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షాలు మద్ధతుగా నిలిచాయి.

ఇక మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్‌పై ఆయన 39,430 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.  

పోటీలో మొత్తం 17 మంది నిలవగా.. మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. చంద్రశేఖర్‌కు 17,268 ఓట్లు రాగా, బీజేపీ బలపరిచిన సుగుణాకర్‌రావుకు 15,077 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు.

click me!