సీఎం కేసీఆర్ కి హైకోర్టు నోటీసులు

By ramya NFirst Published Mar 26, 2019, 4:23 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కి  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.     ఇటవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలసిందే. 


తెలంగాణ సీఎం కేసీఆర్ కి  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.     ఇటవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలసిందే. కాగా.. ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నికల అధికారులకు అందజేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది.

ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటీషన్‌‌లో పేర్కొన్నారు.
 
గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు.. కేసీఆర్‌పై పిటీషన్‌ను దాఖలు చేశారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్‌ను ఎమ్మెల్యే‌గా అనర్హుడు‌గా ప్రకటించాలని పిటీషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

click me!