సాయంత్రం గవర్నర్ తమిళిసై మీడియా సమావేశం.. ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ..

By Sumanth KanukulaFirst Published Nov 9, 2022, 12:35 PM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈ రోజు సాయంత్రం మీడియా మందుకు రానున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ తమిళిసై మీడియా సమావేశం ఉంటుందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈ రోజు సాయంత్రం మీడియా మందుకు రానున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ తమిళిసై మీడియా సమావేశం ఉంటుందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట ప్రభుత్వం వర్సెస్ రాజ్‌భవన్‌గా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై మీడియా సమావేశంలో.. ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. 

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు  బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు  బిల్లుపై వివరణ కోరుతూ ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ బిల్లుపై పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి తనతో చర్చించాలని కోరారు. ఇదే సమయంలో ఈ బిల్లు చెల్లుబాటుపై అభిప్రాయం వ్యక్తం చేయాలని యూజీసీకి కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. 

అయితే గవర్నర్ నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. అయితే లేఖను మెసెంజర్ ద్వారా మంత్రికి పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు  బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలుపాలని తెలంగాణలోని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు రెండు రోజుల పాటు ఢిల్లీ ఉన్న గవర్నర్ తమిళిసై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తిరిగివచ్చిన  వెంటనే గవర్నర్ తమిళిసై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుండంటంతో ఏం చెబతురానేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకని మాట్లాడారా?.. ఈ బిల్లుకు సంబంధించిన అంశాలను ఆమె ప్రస్తావిస్తారా? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక, గవర్నర్ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వం మధ్య ఇప్పటికే గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రోటోకాల్ ఇతర అంశాలపై ఇప్పటికే గవర్నర్ తమిళిసై.. కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్ చేశారు. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు.. ప్రభుత్వానికి, రాజ్‌ భవన్‌కు మధ్య తాజా వివాదానికి కారణంగా మారింది. 

click me!