హన్మకొండలో గవర్నర్ తమిళిసై పర్యటన.. మరోసారి తెరపైకి ప్రోటోకాల్ వివాదం.. గవర్నర్ ఏమన్నారంటే..

By Sumanth KanukulaFirst Published Aug 25, 2022, 2:34 PM IST
Highlights

కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం‌లో పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసై నేడు హన్మకొండకు చేరుకున్నారు. అయితే గవర్నర్‌ తమిళిసై పర్యటనుకు కలెక్టర్ రాజీవన్ హన్మంత్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దూరంగా ఉన్నారు. 

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం‌లో పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసై నేడు హన్మకొండకు చేరుకున్నారు. అయితే గవర్నర్‌ తమిళిసై పర్యటనుకు కలెక్టర్ రాజీవన్ హన్మంత్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దూరంగా ఉన్నారు. కేయూ గెస్ట్ హౌజ్ దగ్గర గవర్నర్ తమిళిసై ఆర్డీవో, డీసీపీ, కేయూ వైస్ చాన్స్‌లర్ స్వాగతం పలికారు. దీంతో గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక, కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. 56 మందికి పీహెచ్‎డీ పట్టాలను ప్రదానం చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రోటోకాల్‌ గురించి గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. తనకు లభిస్తున్న ప్రోటోకాల్ గురించి అంతా చూస్తున్నారని కామెంట్ చేశారు. ‘‘ప్రోటోకాల్ విషయం మీ అందరికి తెలిసిందే.. ఎవరూ వస్తున్నారో, ఎవరూ రావడం లేదో మీకు తెలిసిందే కదా?, మీరు చూస్తున్నారు కదా?’’ అని గవర్నర్ తమిళిసై మీడియాతో అన్నారు. 

మరోవైపు గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సంజయ్ కిరణ్ కుటుంబాన్ని గవర్నర్ తమిళిసై పరామార్శించారు. సంజయ్ కిరణ్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థికసాయం అందజేశారు.. ట్రిపుల్ ఐటీకి వెళ్ళినప్పుడు సంజయ్ కిరణ్ ది నిరుపేద కుటుంబం అని తెలుసుకుని బాధపడిపట్లు తెలిపారు. స్టూడెంట్స్ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని.. ఛాలెంజెస్ను ఫేస్ చేయాలని గవర్నర్ సూచించారు.
 

click me!