రాజ్‌భవన్‌లో హర్ ఘర్ తిరంగ.. సిబ్బందికి జాతీయ జెండాలు, దస్తులు పంపిణీ చేసిన గవర్నర్ తమిళిసై

Published : Aug 02, 2022, 04:04 PM IST
రాజ్‌భవన్‌లో హర్ ఘర్ తిరంగ.. సిబ్బందికి జాతీయ జెండాలు, దస్తులు పంపిణీ చేసిన గవర్నర్ తమిళిసై

సారాంశం

హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోని శానిటరీ, హార్టికల్చరల్ సిబ్బంది తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ జాతీయ జెండాలు, దుస్తులు పంపిణీ చేశారు.

హర్‌ ఘర్ తిరంగలో భాగంగా దేశ ప్రజలు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోని శానిటరీ, హార్టికల్చరల్ సిబ్బంది తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ జాతీయ జెండాలు, దుస్తులు పంపిణీ చేశారు. వరద సహాయక సామాగ్రి కూడా అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను స్వీకరించిన తర్వాత.. వారు ‘‘భారత్ మాతా కీ జై’’ అంటూ తన దేశభక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. 75వ స్వాత్వంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రతి తల్లికి అవగాహన అవసరమన్నారు. ఈ విషయంలో వైద్యులు తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు