ఐదు విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను.. గవర్నర్ తమిళిసై హామీ..

Published : May 17, 2023, 02:24 PM IST
 ఐదు విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను.. గవర్నర్ తమిళిసై హామీ..

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రేదశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయితీలు  ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చాలా బాధపడుతున్నట్టుగా చెప్పారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రేదశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయితీలు  ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చాలా బాధపడుతున్నట్టుగా చెప్పారు. ఈ గ్రామాల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఐదు గ్రామాల విలీన గ్రామాల అంశాన్ని  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వివరాలు.. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈరోజు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఆ తర్వాత భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో ఆదివాసీలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే అంశాన్ని పరిష్కరించాలని గిరిజనులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అలాగే ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేందుకు జోక్యం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. లీన గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనకు తెలుసునని అన్నారు. ఆదివాసీలు సమస్యను పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని.. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?