తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం కల్పించాలి: బండి సంజయ్

Published : May 17, 2023, 02:07 PM IST
  తెలంగాణలో  బీజేపీకి ఒక్క అవకాశం  కల్పించాలి: బండి  సంజయ్

సారాంశం

తెలంగాణలో  బీజేపీకి అవకాశం కల్పిస్తే  రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని   బండి సంజయ్  చెప్పారు. 

హైదరాబాద్:  తెలంగాణలో బీజేపీకి  ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  కోరారు.

బుధవారంనాడు  హైద్రాబాద్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  ప్రభావం  తెలంగాణపై  ఉండదని  ఆయన  అభిప్రాయపడ్డారు.  తెలంగాణలో  బీజేపీకి అధికారం ఇస్తే  రెండు లక్షల  ప్రభుత్వ  ఉద్యోగాలను భర్తీ చేస్తామని బండి సంజయ్  హామీ ఇచ్చారు.అంతేకాదు  ఫీజు రీ ఎంబర్స్ మెంట్  బకాయిలను  కూడా  విడుదల  చేస్తామన్నారు.  తెలంగాణలో  కాంగ్రెస్ ను బలోపేతం  చేసేందుకు  బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని  బండి సంజయ్  విమర్శించారు.

21  రోజుల ఉత్సవాల పేరుతో  కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం  చేస్తున్నారని  చెప్పారు. ప్రభుత్వంలో  30 శాతం  కమిషన్ ఉందని కేసీఆర్ స్వయంగా  చెప్పారని  ఆయన  గుర్తు  చేశారు. గోషామహల్  ఎమ్మెల్యే  రాజాసింగ్ పై విధించిన  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని  పార్టీ అధినాయకత్వాన్ని  కోరినట్టుగా  బండి సంజయ్  చెప్పారు.  ఈ విషయంలో  పార్టీ నాయకత్వం  సానుకూల నిర్ణయం తీసుకుంటుందని  బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

ఉద్యమ కారులను  కేసీఆర్  రోడ్డున పడేసినట్టుగా  ఆయన ఆరోపించారు. తెలంగాణ ద్రోహులను  కేసీఆర్ తన పక్కన  పెట్టుకున్నారని  బండి సంజయ్ విమర్శించారు.. అభివృద్దిపై  కేసీఆర్ శ్వేత పత్రం  విడుదల  చేయాలని ఆయన డిమాండ్  చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?