ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా ప్రభుత్వం పడిపోతుంది - ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Published : Mar 30, 2024, 04:51 PM IST
ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా ప్రభుత్వం పడిపోతుంది - ఏలేటి మహేశ్వర్ రెడ్డి

సారాంశం

బీజేపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా.. 48 గంటల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే  ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని చెప్పారు. 

తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకున్నా.. 48 గంటల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నాయకుడు, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏదో ఒక అంశాన్ని తెర మీదికి తీసుకొని వస్తున్నారని విమర్శించారు. 

8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వెంకట్ రెడ్డి చెబుతున్నారని తెలిపారు. కానీ అసలు మీ సోదరుడు మీతో టచ్ లో ఉన్నారా అని ప్రశ్నించారు. ఆరుగురు మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని చెప్పారు. భువనగిరి లోక్ సభ స్థానాన్ని 2 లక్షల ఓట్లతో బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?