జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భారత రాష్ట్ర సమితి తరుపున జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని గద్వాల విజయలక్ష్మి నిర్ణయం తీసుకున్నారు. గద్వాల విజయలక్ష్మి తండ్రి కె. కేశవరావు కూడ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారు. సోనియాగాంధీ సమక్షంలో కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కె.కేశవరావు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు.
కె.కేశవరావు ఈ నెల 29వ తేదీన తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరిక విషయమై చర్చించారు. రెండు వారాల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని విజయలక్ష్మిని ఆహ్వానించారు. అదే రోజున కె. కేశవరావుతో దీపాదాస్ మున్షి సమావేశమయ్యారు.
undefined
రెండు రోజుల క్రితం కేసీఆర్ తో కె.కేశవరావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరే విషయాన్ని కేసీఆర్ కు కె.కేశవరావు చెప్పారు. అయితే పార్టీ మారాలని కేశవరావు తీసుకున్న నిర్ణయంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడ ప్రచారం సాగిన విషయం తెలిసిందే.
హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టిపిసిసి వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. pic.twitter.com/y4OegGt9CU
— Telangana Congress (@INCTelangana)