తాళికట్టిన భార్య పిల్లలు ఆటోలో కట్టి తగులబెట్టేశారు

Published : May 02, 2019, 09:03 AM IST
తాళికట్టిన భార్య పిల్లలు ఆటోలో కట్టి తగులబెట్టేశారు

సారాంశం

ఒక ఆటోలో నారాయణను బతిమిలాడి ఇంటికి తీసుకెళ్తామని బంధువుకు చెప్పి వెళ్లిపోయారు. అయితే గాదిగూడ మండలంలోని ఖడ్కీ అటవీ ప్రాంతంలో నారాయణ కాళ్లు చేతులు ఆటోకు కట్టేసి నిప్పంటించి తగులబెట్టేశారు. అనంతరం యమునాబాయి తన పిల్లలతో కలిసి జైనూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తన భర్తను హత్య చేశానని అంగీకరించింది.  

గాదిగూడ : కుటుంబ కలహాలతో కుటుంబ యజమాని బలయ్యాడు. తాళికట్టిన భార్య, కన్న బిడ్డలు కలిసి ఒక ఆటోకు కట్టేసి సజీవ దహనం చేసేశారు. ఈ ఘటన కొమరం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే కట్టుకున్న భార్య, కన్న పిల్లలే ఓ వ్యక్తిని ఆటోకు కట్టి కాల్చి చంపేశారు. కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం జంగాం పంచాయతీ రాంజీగూడ గ్రామానికి చెందిన కుమ్ర నారాయణ(52) ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. 

అయితే ఏప్రిల్‌ 25 అర్ధరాత్రి తన భార్య యమునాబాయితో గొడవ పెట్టుకున్నాడు. అర్థరాత్రి భార్య పిల్లలు ఇంట్లో నిద్రపోతుండగా నారాయణ ఇంటికి నిప్పంటించి పరారయ్యాడు. అయితే అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న భార్య యుమునాబాయి, కుమారుడు రాజ్ కుమార్, కుమార్తె ఆదిలక్ష్మీలు ప్రాణాలతో బయటపడ్డారు. 

తన భర్త చేసిన ఘాతుకంతో రగిలిపోయిన యమునాబాయి భర్తను కడతేర్చాలనుకుంది. తమను చంపాలని ప్రయత్నించిన భర్త నారాయణ ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడలో ఉన్న తమ బంధువు శంభు ఇంటిలో ఉన్నాడని తెలుసుకున్ వారు అక్కడికి వెళ్లారు. 

ఒక ఆటోలో నారాయణను బతిమిలాడి ఇంటికి తీసుకెళ్తామని బంధువుకు చెప్పి వెళ్లిపోయారు. అయితే గాదిగూడ మండలంలోని ఖడ్కీ అటవీ ప్రాంతంలో నారాయణ కాళ్లు చేతులు ఆటోకు కట్టేసి నిప్పంటించి తగులబెట్టేశారు. అనంతరం యమునాబాయి తన పిల్లలతో కలిసి జైనూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తన భర్తను హత్య చేశానని అంగీకరించింది.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu