నీ అయ్యకు రాజకీయభిక్ష పెట్టా, నన్నే బఫూన్ అంటావా: కేటీఆర్ పై వీహెచ్ ఫైర్

Published : May 01, 2019, 07:25 PM IST
నీ అయ్యకు రాజకీయభిక్ష పెట్టా, నన్నే బఫూన్ అంటావా: కేటీఆర్ పై వీహెచ్ ఫైర్

సారాంశం

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు మాట్లాడే భాష మార్చుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు వీహెచ్. అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన నన్నే బఫూన్ అంటావా?అంటూ నిప్పులు చెరిగారు. 

హైదరాబాద్: నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టినవాడిని నన్నే బఫూన్ అంటావా అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ వి.హన్మంతరావు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. 

అంతేకాదు మాట్లాడే భాష మార్చుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు వీహెచ్. అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన నన్నే బఫూన్ అంటావా?అంటూ నిప్పులు చెరిగారు. 

సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో చెప్తానని చెప్పుకొచ్చారు. గ్లోబరీనా సంస్థతో తన బావమరిదికి సంబంధం లేకుంటే కేటీఆర్ పెద్దమ్మ గుడికి ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు హాజీపూర్ ఘటనపై వీహెచ్ తీవ్రంగా స్పందించారు. 

హాజీపూర్ ముగ్గరు బాలికలను అతి దారుణంగా హత్య చేసిన మానవమృగం మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!