హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఓ వివాహితపై ప్రభుత్వ ఉద్యోగి ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త చనిపోయిన ఆమె మీద కన్నేసిన అతను మత్తుమందు ఇచ్చి ఆమె మీద అఘాయిత్యం చేశాడు.
హైదరాబాద్ : శంషాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మత్తు మందు ఇచ్చి వివాహితపై ఓ ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా భయపెట్టడానికి ఆమె నగ్న చిత్రాలను ఫోన్లో ఆమెకే పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఆదివారం శంషాబాద్ లో వెలుగు చూసింది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. ముడావత్ చందూలాల్ (40) శంషాబాద్ ఉప కేంద్రంలో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోవడంతో ఓ మహిళ 26 ఉపాధికోసం శంషాబాద్ కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. చందూలాల్ ఆమెపై కన్నేశాడు.
కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె ప్రతి సారి నిరాకరిస్తూ ఉండడంతో… హ్యాండ్ కర్చీఫ్ లో మత్తుమందు పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. తలుపులు వేసి ఉండటంతో తట్టాడు. ఆమె తలుపులు తీయగానే ఆ కర్చీఫ్ ను ఆమె ముక్కు మీద పెట్టాడు. దీంతో ఆ మహిళ సృహ కోల్పోయింది. ఆ తరువాత మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలను ఫోన్ లో చిత్రీకరించి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత మహిళ నగ్న చిత్రాలను ఆమె ఫోన్ కి పంపించి బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
undefined
లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకొని ఇంటర్ స్టూడెంట్ పై అత్యాచారం.. వనపర్తిలో ఘటన..
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జూన్ లో ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. నైరుతి ఢిల్లీలోని ద్వారకాలో ఒక హోటల్ లో మహిళపై అఘాయిత్యం జరిగింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ జూన్ 3న పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి తనకు డేటింగ్ యాప్ లో కలిశాడని.. మే 30న అతనితో కలిసి హోటల్ కి వెళ్లగా అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన ఫోన్ కాల్స్ కు ఆన్సర్ చేయడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని… పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందం హైదరాబాద్‌లో క్యాంప్ చేసింది.
28 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో మోహక్ గుప్తా అనే వ్యక్తిని డేటింగ్ యాప్‌లో కలిశానని, ఆ తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారు.. చాటింగ్ లు కూడా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అలా, మే 30న గుప్తా ఢిల్లీకి వచ్చి తనను కలవాలని మహిళను కోరాడు. వారు ద్వారకలోని ఒక హోటల్‌లో కలుసుకున్నారు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం అందించి, తాగగానే స్పృహ తప్పి పడిపోయాక.. హోటల్ గదిలో ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది. మరుసటి రోజు, ఆ వ్యక్తి ఆమెను మెట్రో స్టేషన్ బయట దింపాడని, మహిళ ఫిర్యాదును ఉటంకిస్తూ ఒక పోలీసు అధికారి తెలిపారు.