కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చే చాన్స్..!

Published : Jul 25, 2022, 12:27 PM IST
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చే చాన్స్..!

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి  అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై పలువురు టీ కాంగ్రెస్ నాయకులు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి  అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌ను మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మరే అంశంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే సమయంలో బీజేపీకి ఉందని ప్రజలు భావిస్తున్నారని కామెంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని అన్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై పలువురు టీ కాంగ్రెస్ నాయకులు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌ కూడా సీరియస్‌గా తీసుకుందని సమాచారం. త్వరలోనే రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని కూడా పార్టీలోని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. 

Also Read: జైలుకు వెళ్లొచ్చిన వాళ్లతో మేం నీతులు చెప్పించుకోవాలా : రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు

ఇక, రాజగోపాల్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంపై తాను రాజీలేని పోరాటం చేస్తున్నానని తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపంచారు. తమ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాలల్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా తానే ఏ నిర్ణయం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్  నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి వివరించారు. 

తాను గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన మాట వాస్తవమేనన్నారు.కానీ, బీజేపీలో చేరిక గురించి ఎప్పుడూ కూడా ప్రకటించలేదన్నారు.తనకు నిలకడ ఉంది కాబట్టే  కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే తాను కొన్ని మాటలు మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. తాను రాజీనామా చేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు.

తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు. టీఆర్ఎస్ ఉసిగొల్పితే ఎన్నికలకు వెళ్లబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. అమిత్ షాను కలిసినందున తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ కు చెందిన మీడియాలో ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. 

తనను గెలిపించిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన తెలిపారు. ఏం చేసినా కూడా తాను తన నియోజకవర్గ ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానన్నారు. తనకు అన్ని పార్టీల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలుంటారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాల వల్ల  పార్టీ బలహీనపడిందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదన్నారు.సోనియాకు, రాహుల్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడబోనని చెప్పారు. సాధు జంతువు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపి పులిలాంటి బీజేపీని కేసీఆర్ కోరితెచ్చుకొంటున్నారన్నారు. ఈ  విషయాన్ని తాను గతంలో చెప్పినట్టుగా గుర్తు చేశారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి ఉందని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే