మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్‌లో ఈడీ సోదాలు.. 90 కోట్లు ఫ్రీజ్

By Siva KodatiFirst Published Jan 18, 2023, 9:53 PM IST
Highlights

మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. క్యూనెట్‌కు చెందిన 36 బ్యాంకుల్లో రూ.90 కోట్లు ఫ్రీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. మనీలాండరింగ్, హవాలా ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. క్యూనెట్‌ అనుబంధ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ సంస్థపై సైబరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. అలాగే క్యూనెట్‌కు చెందిన 36 బ్యాంకుల్లో రూ.90 కోట్లు ఫ్రీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!