బీజేపీ టిక్కెట్టు ఇవ్వకపోతే తాను రాజకీయాలను పక్కన పెడతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
హైదరాబాద్:వచ్చే ఎన్నికల్లో తనకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వకపోతే రాజకీయాలను పక్కన పెడతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు.మంగళవారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.తన ప్రాణం పోయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ లోకి వెళ్లనని ఆయన స్పష్టం చేశారు.తాను సెక్యులర్ పార్టీలోకి వెళ్లబోనని కూడ ఆయన చెప్పారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలనేది తన లక్ష్యంగా పేర్కొన్నారు.దీని కోసం పనిచేస్తానని రాజాసింగ్ తెలిపారు.
బీజేపీ టిక్కెట్టు రాకపోతే ఇండిపెండెంట్ గా కూడ పోటీ చేయనన్నారు. ఎంఐఎం కోరిక మేరకు గోషామహల్ అభ్యర్ధిని బీఆర్ఎస్ ప్రకటించలేదని రాజాసింగ్ ఆరోపించారు. తన విషయంలో బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉందన్నారు.సరైన సమయంలో తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ను విధించే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గత ఏడాది మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విషయమై రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది.ఈ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరింది. ఈ విషయమై బీజేపీ నాయకులు జాతీయ నాయకత్వానికి పలు మార్లు విన్నవించారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశం ఉందని బండి సంజయ్ గతంలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి కోరారు.
also read:వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీకి వస్తాననే నమ్మకం లేదు: రాజాసింగ్ ఆసక్తికరం
ఈ నెల 21 బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో గోషామహల్ అభ్యర్థి పేరును ప్రకటించలేదు.అయితే గత కొన్ని రోజుల క్రితం మంత్రి హరీష్ రావును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు. ఈ భేటీపై అప్పట్లో రకరకాలుగా ఊహగానాలు వెలువడ్డాయి. ఈ ఊహగానాలపై రాజాసింగ్ వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి మంత్రి హరీష్ రావును కలిసినట్టుగా ప్రకటించారు ఈ నెల 21న గోషామహల్ టిక్కెట్టును కేసీఆర్ ప్రకటించకపోవడంపై కూడ మరోసారి రకరకాలుగా ప్రచారం సాగింది.ఈ ప్రచారంపై కూడ రాజాసింగ్ స్పందించారు. ఎంఐఎం సూచన మేరకే గోషామహల్ అభ్యర్థిని బీఆర్ఎస్ ను ప్రకటించనుందని రాజాసింగ్ తెలిపారు.
2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుండి రాజాసింగ్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు అయితే బీజేపీ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఎన్నికల సమయం నాటికి రాజాసింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుంది.