గోషామహాల్ చంద్రముఖి ‘‘అదృశ్యం’’ అంతా డ్రామానే..?

By sivanagaprasad kodatiFirst Published Nov 29, 2018, 10:41 AM IST
Highlights

ప్రజల్లో హైప్ తీసుకురావడంతో పాటు ప్రజల్లో సానుభూతి పొందడానికే చంద్రముఖి ఈ నాటకం ఆడారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజుల పాటు ఆమె విజయవాడలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు. 

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ గోషామహాల్ నియోజవర్గం వార్తల్లో నిలిచింది. అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోటీగా ఒక హిజ్రా బరిలోకి నిలిచింది. బీఎల్‌ఎఫ్ తరపున ఆమె నామినేషన్ వేశారు.

హిజ్రా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. రాజాసింగ్, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్‌ల మధ్య రసవత్తర పోటీ ఖాయమైన నేపథ్యంలో చంద్రముఖి రాకతో గోషామహాల్‌పై ఆసక్తి పెరిగింది. 

అందుకు తగినట్టుగానే తోటి హిజ్రాలు, బీఎల్ఎఫ్ నేతల సాయంతో ఆమె ముమ్మరంగా ప్రచారం చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రముఖి ఒక్కసారిగా అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆమె తల్లితో పాటు పార్టీ నేతలు చంద్రముఖి ఫోన్‌కి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నామినేషన్ ధైర్యంగా వేసిన ఆమె కొద్దిరోజుల తర్వాత తనకు ప్రాణహానీ ఉందని తెలిపారు. అలా చెప్పిన కొద్దిగంటల్లోనే కనిపించకుండా పోవడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఆమెను ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారా..లేక ఇంకేమైనా జరిగిందా అంటూ రకరకాల కథనాలు తెరమీదకు వచ్చాయి. 

నాలుగు రోజులు గడుస్తున్నా తన కుమార్తె కనిపించకపోవడంతో చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గురువారం ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రముఖి ఆచూకి కనుగొని నిన్న రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే ఆమె అదృశ్యమవ్వడం అంతా డ్రామా అనే ప్రచారం జరుగుతోంది.

ప్రజల్లో హైప్ తీసుకురావడంతో పాటు ప్రజల్లో సానుభూతి పొందడానికే చంద్రముఖి ఈ నాటకం ఆడారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజుల పాటు ఆమె విజయవాడలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు. అయితే ఇందులో నిజనిజాలు తెలియాలంటే చంద్రముఖి మీడియా ముందుకు రావాల్సిందే.     

గోషామహాల్ చంద్రముఖి దొరికింది

వీడని సస్పెన్ష్...గోషామహాల్ చంద్రముఖి ఏమైంది: విషయం హైకోర్టుకి

గోషామహాల్ నుండి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి బరిలోకి

click me!