వాళ్లను కాల్చేస్తేనే దేశానికి రక్షణ : బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

First Published Jul 31, 2018, 5:41 PM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బిజెపి పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అదే పని చేశారు. దేశంలోని అక్రమ చోరబాటుదారులను కాల్చి చంపాలని, అప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇపుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.  

అసోంలో నివసిస్తున్న 40 లక్షల మంది సాంకేతికంగా ఈ దేశ పౌరులు కారని జాతీయ పౌర రిజిస్ట్రర్(ఎన్‌ఆర్సీ) తేల్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌ఆర్సీ రిపోర్టుపై రాజాసింగ్ స్పందిస్తూ... తెలంగాణ జనాభా విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని అన్నారు. రాష్ట్రంలోని 3.29 కోట్ల జనాభాలో కేవలం 2.89 కోట్లమందే భారత పౌరులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భారత్ లోకి బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి భారీ ఎత్తున చొరబాట్లు జరుగుతున్నట్లు రాజాసింగ్ తెలిపారు. ఇలా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాల వల్ల దేశానికి ప్రమాదం పొంచిఉందని, వారు గౌరవంగా దేశాన్ని వదిలివెళ్ళాలని హెచ్చరించారు. లేకుంటే వారిని కాల్చేసి దేశాన్ని రక్షించాలని, ఇలా అయితేనే దేశం, దేశ ప్రజలు క్షేమంగా ఉంటారంటూ రాజాసింగ్ వ్యాఖ్యనించారు.
 
click me!