గొర్రెకుంట సామూహిక హత్యలు: అతన్ని సైకిల్ సవారీయే పట్టించింది

By telugu teamFirst Published May 26, 2020, 4:21 PM IST
Highlights

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో సంజయ్ కుమార్ యాదవ్ ను అతని సైకిల్ సవారీయే పట్టించింది. సైకిల్ పై రెక్కీ నిర్వహించడమే కాకుండ గురువారం సైకిల్ పై వెళ్లాడు. అవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యల మిస్టరీని పోలీసులు 72 గంటల్లో ఛేదించిన విషయం తెలిసిందే. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిడదవోలులో చేసిన ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి అతను 9 మందిని హత్య చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ చెప్పాడు. 

కాగా, సైకిల్ సవారీ మోజు సంజయ్ కుమార్ ను పట్టుకోవడానికి పోలీసులకు సాయపడినట్లు తెలుస్తోంది. సంజయ్ తెల్లగా, అందంగా ఉంటాడు. తన అందానికి అమ్మాయిలు పడిపోతారనేది అతని నమ్మకం. అతను ఎక్కడికి వెళ్లినా సైకిల్ మీదనే వెళ్లేవాడు. 

Also Read:నిద్ర మాత్రలతో సంజయ్ హత్యలు: రఫికా, గొర్రెకుంట వద్ద 9 మంది మర్డర్స్

తాను ఉండే జాన్ పాక నుంచి హత్యలు జరిగిన ప్రాంతానికి సంజయ్ ప్రతి రోజూ సైకిల్ మీదే వచ్చి వెళ్లాడు. రెక్కీ నిర్వహించిన రోజుల్లో, హత్యలు చేసిన రోజు, ఆ తర్వాత రోజు కూడా అతను సైకిల్ మీదనే రౌండ్లు కొట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ సైకిల్ సవారీయే సంజయ్ ను పట్టించింది. 

స్థానిక పోలీసు ందాలు, టాస్క్ ఫోర్స్, సీసిఎస్, సైబర్ క్రైమ్,త టెక్నికల్ టీమ్, హైదరాబాదు నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేశా.ి సంజయ్ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజూ సైకిల్ పై వెళ్లడం గోదాం, గొర్రెకుంట ఏరియాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. 

Also Read: ప్రియురాలి కూతురిపై కన్ను: రఫికా హత్యకు సంజయ్ ప్లాన్ ఇదీ...

గురువారం ఉదయం 5 గంటల తర్వాత కూడా అతను సైకిల్ మీద వెళ్లడం రికార్డయింది. బుధవారం రాత్రే హత్యలు జరిగాయి. తెల్లారి ఐదు గంటల వరకు తొమ్మిది మందిని ఒక్కరొక్కరినే సంజయ్ ఈడ్చుకెళ్లి బావిలో పడేసినట్లు సీపీ రవీందర్ చెప్పిన విషయం తెలిసిందే. బావిలో వారిని పడేసిన తర్వాత సైకిల్ మీద వెళ్తున్న అతను సిసి కెమెరాలకు చిక్కాడు. 

సోమవారం మధ్యాహ్నం పోలీసులు సంజయ్ ను పోలీసులు అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. 9 హత్యలు కూడా తానే చేసినట్లు సంజయ్ అంగీకరించాడని సీపీ రవీందర్ చెప్పారు. 

ఇదిలావుంటే, మక్సూద్ బంధువులు పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్ వచ్చారు. మక్సూద్ కుటుంబంలోని ఆరుగురు సంజయ్ కుమార్ యాదవ్ చేతిలో హతమైన విషయం తెలిసిందే. మృతదేహాలను పోలీసులు వారికి అప్పగించారు. అయితే, ఒక్కడు 9 మందిని ఎలా చంపాడని వారు సందేహం వ్యక్తం చేశారు.

click me!