CM Revanth Reddy: తెలంగాణ లోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి హమీ ఇచ్చారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే రోజు 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగాఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తుందని తెలిపారు. పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రేవంత్‌రెడ్డి.. గులాబీ పార్టీ విద్యార్థులను, నిరుద్యోగ యువకులను విస్మరించిందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఉంచారని ఆరోపించారు. “కేసీఆర్ తన కొడుకు, కుమార్తె, మేనల్లుడు,అతని కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు, కానీ విద్యార్థులు, నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు రాష్ట్ర సాధన కోసం పోరాడగా, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని నమ్మి వందలాది మంది తమ జీవితాలను త్యాగం చేశారు. కానీ వారి కలలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది' అని ఆయన అన్నారు.
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే తప్ప ఉద్యోగాలు రావని విద్యార్థులు, నిరుద్యోగ యువత గ్రహించిందనీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారని తెలిపారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తన కూతురు కవితను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడ చంద్రశేఖర్ రావుపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి.. 2019లో నిజామాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయారనీ, కేసీఆర్ తన కూతురు ఉద్యోగం పోయినందుకు చాలా బాధపడి, నెలరోజుల్లోనే ఆమెకు మరో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అన్నారు. మరీ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎందుకు పట్టుకోలేదనీ, కుతూరి పట్ల చూపిన శ్రద్ధ.. ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల, ప్రభుత్వ శాఖల్లో ఖాళీపై ద్రుష్టి సారిస్తే.. ఈ రోజులు ఇలా పరిస్థితి వచ్చేది కాదనీ అన్నారు.
ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంపై పెద్దఎత్తున అప్పుల భారం పడుందనీ, అయినా..గత ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ఏ ఒక్క పని చేయలేదని మండిపడ్డారు. కొత్త స్టాఫ్ నర్సుల నియామకం వల్ల నెలకు రూ.500 కోట్ల జీతాల భారం పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం నియామక ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించిందని భట్టి తెలిపారు.