రాచకొండ పోలీసులకు శుభవార్త

Published : Nov 04, 2017, 06:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రాచకొండ పోలీసులకు శుభవార్త

సారాంశం

రాచకొండ పోలీస్ సిబ్బంది కొరకు సబ్సిడీ క్యాంటీన్ ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ

తెలంగాణ జిల్లాల ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటిసారిగా రాచకొండ పోలీస్ కమిషనేరేట్ పరిదిలో పోలీస్ సబ్సిడీ క్యాంటిన్ అందరికి అందుబాటులో ఉండేవిదంగా వనస్థలిపురంలో ఏర్పాటు చేశారు.

పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి సిబ్బందికి అందుబాటులో వుండేవిదంగా కొత్తగా క్యాంటిన్ ఏర్పాటు చేయవలసిందిగా సీపీ మహేష్ భగవత్ ను కోరారు. ఆయన రాతపూర్వకంగా విన్నపం చేయగా వెంటనే స్పందించి డీజీపీ గారి ద్వారా కేంద్ర హోమ్ శాఖ కు ప్రతిపాదనలు పంపి అనుమతి తీసుకొని ఇవాళ ప్రారంభించారు.

ప్రతిరోజు 18 లక్షల విలువైన సరుకులు వినియోగించేలా క్యాంటిన్ ఏర్పాటు చేశారు. డిజిపి అనురాగ్ శర్మ క్యాంటీన్ ను ప్రారంభించి స్మార్ట్ కార్డ్ అందించారు. ఈ క్యాంటీన్ ను రాచకొండ పోలీస్ సిబ్బంది (హోంగార్డు నుండి సీపీ వరకు) అందరూ వినియోగించే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. ఇక్కడికి వచ్చేసిబ్బందికి విధిగా స్మార్ట్ కార్డ్ ఇవ్వబడుతుందని తెలిపారు.

అందరికి సబ్సిడీలో లభించే వస్తువులు  వచ్చేవిదంగా ప్రతినెల లిమిటెడ్ గా ప్లాన్ చేయడం జరుగుతుందన్నారు. రాచకొండ కమిషనేరేట్ పరిధిలోని LB నగర్ జోన్, మల్కాజిగిరి జోన్, యాదాద్రి భువనగిరి జోన్ సిబ్బందికి అందుబాటులో ఏర్పాటు చేసినందుకు డీజీపీ, సీపీ, జాయింట్ సీపీ, డీసీపీ (ఆడ్మిన్) లకు పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు.

 

తాజా వార్తల కోసం ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/p4vX5F

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్