ఉద్యోగాల పేరిట భారీ మోసం, కోట్లల్లో వసూళ్లు... మంత్రి కొప్పులపై గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు (Video)

Arun Kumar P   | Asianet News
Published : Dec 17, 2021, 11:37 AM ISTUpdated : Dec 17, 2021, 11:39 AM IST
ఉద్యోగాల పేరిట భారీ మోసం, కోట్లల్లో వసూళ్లు... మంత్రి కొప్పులపై గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు (Video)

సారాంశం

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీల ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మంత్రి కొప్పుల ఈశ్వర్ మోసం చేసాడని మాజీ ఎమ్మెల్యే గోనెె ప్రకాష్ రావు ఆరోపించారు. 

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులపై ఆర్టీసి మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (gone prakash rao) తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar), రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (korukanti chandar) పై సంచలన ఆరోపణలు చేసారు. రామగుండం ఎరువుల కర్మాగారం (ramagundam fertilizer factory)లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని... దీని వెనక మంత్రి, ఎమ్మెల్యే హస్తముందని ప్రకాశ్ రావు ఆరోపించారు. 

రామగండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోహన్ గౌడ్ అనే వ్యక్తి 370 మంది నుండి దాదాపు రూ.30కోట్లు వసూలు చేసాడని ప్రకాష్ రావు పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుండి 5లక్షల నుండి 8లక్షల రూపాలయ వరకు వసూలు చేసాడన్నారు. ఎరువుల ప్యాక్టరీలో పర్మినెంట్ ఉద్యోగాలని నమ్మించి ఈ వసూళ్లకు పాల్పడ్డాడని పేర్కొన్నాడు.

Video 

ఉద్యోగాల పేరిట జరిగిన వసూళ్ల వెనుక మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి వున్నారని ప్రకాష్ రావు ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన మోహన్ గౌడ్ ఎమ్మెల్యే చందర్  అనుచరుడేనని తెలిపారు.  వీరంతాకలిసి భారీ దోపిడీకి పాల్పడ్డారని ప్రకాష్ రావు మండిపడ్డారు. 

read more  బయో డేటా కాదు బ్యాలన్స్ షీట్ చూసే టికెట్లు...ఇదీ కేసీఆర్ రాజకీయం..: గోనె ప్రకాష్ రావు

రామగుండం ఎరువలు ఫ్యాక్టరీలో శాశ్వత ఉద్యోగాలు (permanent employment) ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసారని... కానీ అలా చేయలేదని అన్నారు. భారీగా డబ్బులు వసూలు చేసికూడా వారు ఇప్పించినవి పర్మినెంట్ ఉద్యోగాలు కావని... తాత్కాలికమైనవేనని ప్రకాష్ రావు పేర్కొన్నారు. ఓవైపు కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంది... అలాంటప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఎలా పర్మినెంట్ అవుతాయి? అని ప్రశ్నించారు.

డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలిచ్చిన వారికి పర్మినెంట్ చేస్తే తానే పదికోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రకాష్ కావు పేర్కొన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాళ్లు విసిరారు. బాదితులకు జనవరి 31 లోపు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని... లేదంటే మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ చిట్టా విపుతానని ప్రకాష్ రావు హెచ్చరించారు.  

read more  కేటీఆర్ కు చెక్ పెడుతూ... సీఎం సీటుపై కన్నేసిన ఎంపి సంతోష్: గోనె ప్రకాష్ సంచలనం (వీడియో)

కేవలం ఉద్యోగాలే కాదు పదవులను సైతం మంత్రి, ఎమ్మెల్యే అమ్ముకున్నారని ఆరోపించారు. వలసవాదులకు రామగుండం మేయర్ స్థానాన్ని అమ్మకోవడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. స్థానికులను కాదని ఆంద్ర ప్రాంతానికి చెందిన నాయకుడికి ఎలా మేయర్ కుర్చీ అప్పగిస్తారని నిలదీసారు. మేయర్ చేత వెంటనే రాజీనామా చేయించి స్థానికుడికి ఆ పదవి అప్పగించాలని... లేదంటే ఈ విషయంలో జరిగే పరిణామాలకు ఎమ్మెల్యే చందర్ బాద్యత వహించాల్సి వుంటుందని ప్రకాష్ రావు హెచ్చరించారు.   

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు