తెలంగాణలో భారీ తగ్గనున్న బంగారం ధర

First Published Jul 11, 2018, 10:18 AM IST
Highlights

దేశ అవసరాల్లో ఏకంగా పదోవంతు బంగారాన్ని ఇక్కడే తయారు చేయనున్నారు. బంగారాన్ని శుద్ధి చేసే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బంగారం చౌకగా లభించనుంది. అంతేకాదు.. తెలంగాణ నుంచి విదేశాలకు కూడా బంగారాన్ని ఎగుమతి చేయనున్నారు. ఇక్కడ ఏదైనా బంగారం తయారీ ఫ్యాక్టరీ పెడుతున్నారా ఏందీ.. అనుకుంటున్నారా...? మీరు అనుకుంది నిజమే. తెలంగాణలో పసిడిని తయారు చేయనున్నారు.

దేశ అవసరాల్లో ఏకంగా పదోవంతు బంగారాన్ని ఇక్కడే తయారు చేయనున్నారు. బంగారాన్ని శుద్ధి చేసే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. దీనితోపాటు భారత్‌కే చెందిన బియానీ గ్రూప్‌ కూడా తెలంగాణలో బంగారం శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. 

ఇవి రెండూ కలిసి రెండు రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నాయి. హంటన్‌ గ్రూపునకు అవసరమైన 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ స్థలాన్ని సదరు సంస్థ ఇటీవల సందర్శించింది కూడా. ఇక్కడ ఏర్పాటు చేయనున్న సెజ్‌లో రెండు విడతలుగా సదరు సంస్థ రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

ఇందులో తొలి విడత రూ.550 కోట్లు, రెండో విడత రూ.750 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఈ సెజ్‌లో బంగారం శుద్ధి ప్లాంటుతోపాటు వెండి శుద్ధి కేంద్రాలను కూడా సంస్థ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో ఏటా 30 టన్నుల బంగారం, 100 టన్నుల వెండి శుద్ధి లక్ష్యంతో ప్లాంటును నిర్మించనుంది. రెండో దశలో 50 టన్నుల బంగారం, 150 టన్నుల వెండి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇలాంటి సెజ్‌ ఉంది. హైదరాబాద్‌ సెజ్‌ దేశంలో రెండోది అవుతుంది.

click me!