Shamshabad Airportలో భారీగా బంగారం పట్టివేత

By Rajesh KFirst Published Jan 22, 2022, 11:40 AM IST
Highlights

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2.6 కేజీల1.38 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఒక ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన నవాజ్ పాషా అనే వ్య‌క్తి..  బంగారాన్ని క్యాప్సూల్స్ లో దాచి   తీసుకోచ్చినట్టు కస్టమ్స్ సిబ్బంది వెల్లడించారు. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. దీని విలువ 1.38 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

 మ‌రోవైపు.. డ్ర‌గ్స్ ను లోదుస్తుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఉగాండ దేశీయుడిని  చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు  రూ.7 కోట్ల విలువ గల హెరాయిన్​ను స్వాధీనం  చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వ‌హించారు. ఈ క్రమంలో అతని లోదుస్తుల్లో 108 హెరాయిన్ క్యాప్సూల్స్​ను గుర్తించారు.  

మరో ఘటనలో దుబాయ్​ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి బంగారం కడ్డీలు, గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.69.44 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
 

click me!