ప్యాంట్ ప్రత్యేక జేబులో బంగారం: శంషాబాద్‌లో పట్టుకొన్న కస్టమ్స్ అధికారులు

By narsimha lodeFirst Published Nov 5, 2020, 4:45 PM IST
Highlights

 అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

బంగారాన్నిఅక్రమ రవాణాను నిరోధించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకొంటున్నా కూడ అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిఘా పెరుగుతున్న కొద్ది బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు కొత్త కొత్త పద్దతులను ఉపయోగిస్తున్నారు.  అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు గాను  ప్యాంట్ జేబులో ప్రత్యేకంగా జేబు ఏర్పాటు చేసుకొన్నాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.

also read;వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం

దుబాయ్ నుండి హైద్రాబాద్ నగరానికి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి బంగారం తరలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తన ప్యాంట్ లోపల ప్రత్యేకంగా జేబు ఏర్పాటు చేసుకొన్నాడు. దీనిలో 71.47 గ్రాముల బంగారాన్ని ముక్కలుగా కట్ చేసి అందులో పెట్టాడు.  కానీ, కస్టమ్స్  అధికారుల తనిఖీలో ఈ జేబు బంగారం బయటపడింది.

ఈ బంగారం విలువ రూ. 3,67, 570 గా ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో కూడ విదేశాల నుండి బంగారాన్ని తీసుకొస్తూ పలువురు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే.


 

click me!