మిస్సింగ్ కేసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్: కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

Published : Nov 05, 2020, 04:19 PM IST
మిస్సింగ్ కేసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్: కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

సారాంశం

మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.  


హైదరాబాద్: మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.గురువారం నాడు తెలంగాణలో మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.

also read:ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చొద్దా: ఈసీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 2014 నుండి 2019 వరకు 8 వేల మంది ఆచూకీ లేకుండా పోయిన విషయాన్ని పిటిషన్ ఈ సందర్భంగా పిటిషనర్ గుర్తు చేశారు.
రోజూ మిస్సింగ్ కేసులు నమోదౌతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

2019  నుండి 2020 అక్టోబర్ వరకు  సుమారు 16 వేల మంది అదృశ్యమయ్యారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మిస్సింగ్ కేసుల విషయమై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ప్రభుత్వం తెలిపింది.

చైల్డ్ వేల్పేర్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై డిసెంబర్ 3న నివేదిక అందిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu