కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన మహిళ ఒంటిపై నగలు మాయమైన ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. బాధిత కుటుంబం హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన మహిళ ఒంటిపై నగలు మాయమైన ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. బాధిత కుటుంబం హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేసింది.
కరోనాతో చికిత్స కోసం హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే మృతదేహంపై నుండి బంగారు ఆభరణాలు మాయమైనట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
also read:కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా
మృతురాలి చెవికి వజ్రాల చెవి కమ్మలు, ముక్కుపుడక కన్పించకుండా పోయాయని కుటుంబసభ్యులు ఆసుపత్రి వర్గాలను ప్రశ్నించాయి. కానీ ఆసుపత్రి నుండి సరైన సమాధానం రాలేదు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 1891 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 66,677కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనా నుండి 47,590 మంది కోలుకొన్నారు.