23 మందితో బీజేపీ రాష్ట్ర కమిటి: మాజీ ఎమ్మెల్యేలకు చోటు

By narsimha lodeFirst Published Aug 2, 2020, 11:19 AM IST
Highlights

23 మందితో రాష్ట్ర కమిటిని ఏర్పాటు చేసింది బీజేపీ  తెలంగాణ నాయకత్వం.  ఎనిమిది మంది ఉపాధ్యక్షుడు, 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటిలో చోటు దక్కింది. రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది.

హైదరాబాద్: 23 మందితో రాష్ట్ర కమిటిని ఏర్పాటు చేసింది బీజేపీ  తెలంగాణ నాయకత్వం.  ఎనిమిది మంది ఉపాధ్యక్షుడు, 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులకు కమిటిలో చోటు దక్కింది. రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది.

కొత్త కమిటిలో ఉపాధ్యక్షులుగా విజయరామారావు,చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణిలకు చోటు దక్కింది.

 ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులును నియమించారు. కార్యదర్శులుగా రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి,ఉమారాణిలను నియమించారు.ట్రెజరర్‌ గా బండారి శాంతికుమార్‌,బవర్లాల్‌ వర్మకు జాయింట్ ట్రెజరర్ గా చోటు కల్పించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. 

బీజేపీ అనుబంధ విభాగాలకు కూడ అధ్యక్షులను నియమించారు. బీజేవైఎం అధ్యక్ష పదవిని భానుప్రకాష్ కు కట్టబెట్టారు. మహిళా మోర్చా అధ్యక్ష పదవిని గీత మూర్తికి, కిసాన్ మోర్చాకు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చాకు కొప్పుల భాషా, ఓబీసీ మోర్చాకు అలె భాస్కర్, మైనార్టీ మోర్చాకు అస్పర్ పాషాను నియమించారు.మరో వైపు అధికార ప్రతినిధులుగా కృష్ణసాగర్ రావు, రజనికుమారి, రాకేష్ రెడ్డిలను నియమిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

 

click me!