యాత్ర సినిమాకి.. కాంగ్రెస్ వార్నింగ్

Published : Feb 07, 2019, 09:39 AM IST
యాత్ర సినిమాకి.. కాంగ్రెస్ వార్నింగ్

సారాంశం

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతది తెలసిందే. కాగా ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర బృందానికి కాంగ్రెస్ హెచ్చరికలు జారీ చేసింది.  

 ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతది తెలసిందే. కాగా ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర బృందానికి కాంగ్రెస్ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ సినిమా పై కాంగ్రెస్ నేత మానవతా రాయ్ మాట్లాడుతూ... యాత్ర సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లను కించపరస్తే సినిమాకి తెలంగాణలో నిరసనలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే సంభాషణలు, దృశ్యాలను తొలగించకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ నేతలను కించపరిచేలా యాత్ర సినిమాలో సన్నివేశాలుంటే.. సినిమా ప్రదర్శించే థియేటర్ల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతారన్నారు.

వైఎస్ఆర్ చివరి శ్వాస వరుకు కాంగ్రెస్ పార్టీకి,  సోనియా గాంధీ గారికి విధేయుడిగా ఉన్నారని.. అలాంటి మహానేత చరిత్రను, కాంగ్రెస్ విధేయతను, ఆయన వ్యక్తిత్వాన్ని వక్రీకరిస్తే నిర్మాత, దర్శకులకి తగురీతిలో బుద్ది చెబుతాం అని మానవతా రాయ్ అన్నారు.

యాత్ర సినిమాలోని అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే సినిమా విడుదల చేయాలని హైద్రాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు రేపు పిర్యాదు చేస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు మరియు పార్టీ ఆఫీస్ బేరర్లకు సినిమా చూపించి వారు అభ్యంతరాలు లేవనెత్తకుంటేనే సినిమా విడుదల చేయాలని మానవతా రాయ్ కోరారు. 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్