అన్ని ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు పంపండి: ఏపీ, తెలంగాణలకు గోదావరి యాజమాన్య బోర్డు లేఖ

Siva Kodati |  
Published : Jul 16, 2021, 09:10 PM ISTUpdated : Jul 16, 2021, 09:11 PM IST
అన్ని ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు పంపండి: ఏపీ, తెలంగాణలకు గోదావరి యాజమాన్య బోర్డు లేఖ

సారాంశం

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు శుక్రవారం లేఖ రాసింది. గోదావరి బేసిన్‌లో నిర్మాణం చేపడుతున్న, చేపట్టిన ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు పంపాలని లేఖలో గోదావరి బోర్డు పేర్కొంది. 

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు శుక్రవారం లేఖ రాసింది. గోదావరి బేసిన్‌లో నిర్మాణం చేపడుతున్న, చేపట్టిన ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు పంపాలని లేఖలో గోదావరి బోర్డు పేర్కొంది. 

అంతకుముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుండి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు గురువారం నాడు రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ ఏడాది  అక్టోబర్ 14 నుండి అమల్లోకి రానుందని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read:ఏపీ, తెలంగాణ జలజగడానికి చెక్, గెజిట్ విడుదల: ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డులదే

ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది.రెండు మాసాల్లో  ఈ నిధులను  జమ చేయాలని  కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ  ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైనా  వాటిని నిలిపివేయాలి.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu