రేణికుంట వద్ద పల్టీ కొట్టిన కారు: సింగరేణి ఆసుపత్రి డాక్టర్ కిరణ్ రాజుకి గాయాలు

Published : Nov 28, 2022, 10:18 PM IST
రేణికుంట వద్ద పల్టీ కొట్టిన కారు: సింగరేణి  ఆసుపత్రి  డాక్టర్  కిరణ్  రాజుకి గాయాలు

సారాంశం

ఉమ్మడి  కరీంనగర్ జిల్లాలోని  రేణికుంట టోల్  గేటు  వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో  సింగరేణి  ఆసుపత్రి  సూపరింటెండ్  డాక్టర్  కిరణ్  రాజు  తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన  కిరణ్  రాజుని ఆసుపత్రికి  తరలించారు.

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో  సోమవారం నాడు జరిగిన  రోడ్డుప్రమాదంలో  గోదావరిఖని సింగరేణి  ఆసుపత్రి సూపరింటెండ్  డాక్టర్  కిరణ్  రాజు తీవ్రంగా  గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో  ఆయన  భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలోని రేణికుంట టోల్ గేటు వద్ద  రోడ్డు ప్రమాదం  జరిగింది.  డాక్టర్  కిరణ్  రాజు ప్రయాణీస్తున్న  కారు  పల్టీ   కొట్టింది.ఈ ప్రమాదంలో  కారులో ప్రయాణీస్తున్న  కిరణ్  రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య  స్వల్పంగా గాయపడ్డారు. భార్యతో  కలసి కిరణ్  రాజు  హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి  గురైంది.  

PREV
click me!

Recommended Stories

Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే
IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు