భైంసా నిషేధిత ప్రాంతమా?: ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైందన్న బండి సంజయ్

By narsimha lode  |  First Published Nov 28, 2022, 9:05 PM IST


ఆడెల్లి పోచమ్మ ఆలయంలో  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన  ఐదో విడత  ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైందని  సంజయ్  ప్రకటించారు. 
 



ఆదిలాబాద్:భైంసాలో  తిరగడానికి  వీసాలు తెచ్చుకోవాలా అని  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ప్రశ్నించారు. భైంసా  నిషేధిత  ప్రాంతమా  అని  బండి  సంజయ్ ప్రశ్నించారు. ఇక్కడ తిరగడానికి  అనుమతిని తీసుకోవాలా అని  అడిగారు. భైంసాకు తాను ఎందుకు పోవద్దో  చెప్పాలన్నారు. 

నిర్మల్  జిల్లాలోని  ఆడెల్లి పోచమ్మ ఆలయంలో  సోమవారంనాడు  రాత్రి  బండి  సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన  మీడియాతో  మాట్లాడారు. నిన్న చెప్పినట్టుగానే తాను  పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టుగా  బండి  సంజయ్  చెప్పారు. ఆడెల్లి  పోచమ్మ తల్లి సాక్షిగా  పాదయాత్రను ప్రారంభించానన్నారు. 

Latest Videos

undefined

 భైంసాలో  పోలీసులకు బందోబస్తుకు విధులు కూడా కేటాయించారన్నారు. కానీ  భైంసాలో  తమ సభకు  అనుమతి లేదని  చెప్పడం ఆశ్చర్యం అనిపించినట్టుగా  చెప్పారు. సెన్సిటివ్  ప్రాంతమనే పేరుతో  బైంసాలో తమ సభకు అనుమతిని  నిరాకరించారన్నారు. భైంసాను సెన్సిటివ్  ప్రాంతంగా  ఎవరూ మార్చారో  చెప్పాలని బండి  సంజయ్ ప్రశ్నించారు. 

కుంటిసాకులతో  తన  ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని  కేసీఆర్ సర్కార్ చూస్తుందని  ఆయన  విమర్శించారు. ప్రభుత్వం  తన  పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తే  హైకోర్టు  మాత్రం పాదయాత్రకు అనుమతిని  ఇచ్చిందన్నారు పాదయాత్ర విషయంలో  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను  పాటించనున్నట్టుగా  ఆయన  చెప్పారు.
 

click me!