జీవో నెంబర్ 111 : నిబంధనల ఎత్తివేత... 84 గ్రామాలకు విముక్తి, కేసీఆర్ సర్కార్ ఆదేశాలు

Siva Kodati |  
Published : Apr 20, 2022, 07:55 PM ISTUpdated : Apr 20, 2022, 08:05 PM IST
జీవో నెంబర్ 111 : నిబంధనల ఎత్తివేత... 84 గ్రామాలకు విముక్తి, కేసీఆర్ సర్కార్ ఆదేశాలు

సారాంశం

తెలంగాణ కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా జీవో నెం 111ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ సమీపంలో వున్న 84 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.   

జీవో 111 (go no 111) పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం (telangana govt)  ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త జీవో జారీ చేసింది కేసీఆర్ (kcr) సర్కార్. దీంతో మొత్తం 84 గ్రామాలకు జీవో 111 నుంచి విముక్తి కలిగినట్లయ్యింది. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే  ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. కాగా..  హైద‌రాబాద్ మహానగరం చుట్ట‌ప‌క్క‌ల అభివృద్ధికి గొడ్డ‌లిపెట్టులా మారిన జీవో 111ను ఎత్తివేయాల‌ని ఇటీవల తెలంగాణ కేబినెట్ (telangana cabinet) నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ఉన్నా... భూములను వ్య‌వ‌సాయేత‌ర కార్య‌క‌లాపాల‌కు వినియోగించుకునేందుకు అనుమ‌తిలేక ఇబ్బందిప‌డుతున్న‌ ఆయా గ్రామాల ప్ర‌జ‌లకు ప్రభుత్వ నిర్ణయం సంతోషం కలిగించింది. 

జంట జలాశయాల పరిరక్షణకు సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్రీన్‌జోన్‌లను గుర్తించనుంది కమిటీ. మురుగునీరు వెళ్లే టాక్‌లైన్స్ ఏర్పాటుపై ప్లానింగ్ చేయనుంది. ఎస్టీపీలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు తయారు చేయనుంది కమిటీ. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్