Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడింది

Published : May 08, 2025, 10:38 PM IST
Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడింది

సారాంశం

Obulapuram mining case: అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు.

Obulapuram illegal mining scam: ఓబుళాపురం అక్రమ మైనింగ్, భూకబ్జా కేసులో గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి దోషి అని సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. గాలి జనార్ధన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత హైదరాబాద్ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. దీని తర్వాత కర్ణాటక శాసనసభ చర్యలు తీసుకుంది. శాసనసభ కార్యదర్శి విశాలాక్షి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మే 6 నుంచి జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా అనర్హులయ్యారు.

సీబీఐ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఆరు సంవత్సరాల పాటు ఆయన అనర్హులుగా ఉంటారు. శిక్ష పూర్తయ్యే వరకు లేదా కోర్టు స్టే ఇచ్చే వరకు ఈ అనర్హత కొనసాగుతుంది. నిబంధనల ప్రకారం ఏదైనా శాసనసభ్యుడు లేదా పార్లమెంటు సభ్యుడు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే వారి పదవి రద్దవుతుంది.

రెడ్డి శిక్షను కెఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. అక్రమ మైనింగ్ కింగ్ పిన్ జనార్ధన్ రెడ్డికి ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం మంచి పరిణామం అని కర్ణాటక రాష్ట్ర సమితి (కెఆర్ఎస్) పార్టీ పేర్కొంది. జనార్ధన్ రెడ్డి బళ్లారి రిపబ్లిక్ ను కూల్చడంలో సమాజ పరివర్తన సముదాయం ఎస్.ఆర్.హిరేమఠ్, అప్పటి లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే కీలక పాత్ర పోషించారు. ఇది మొత్తం అక్రమ మైనింగ్ కేసులో రెండో ముఖ్యమైన తీర్పు. ఇప్పటికే మరో కేసులో సతీష్ సైల్ కు బెలకేరి కేసులో శిక్ష పడింది. సుగలమ్మ దేవి ఆలయాన్ని కూల్చిన జనార్ధన్ రెడ్డిని బిజెపి వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి. మిగిలిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన విచారణ జరపాలని పార్టీ డిమాండ్ చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు