పెళ్లి చేసుకుంటానని మోసం.. మేనబావ ఇంటిముందు మరదలి నిరసన...(వీడియో)

Published : Sep 30, 2021, 11:03 AM IST
పెళ్లి చేసుకుంటానని మోసం.. మేనబావ ఇంటిముందు మరదలి నిరసన...(వీడియో)

సారాంశం

రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి  చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి  వాపోయింది. తన తల్లి మాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని  గౌతమి ఆవేదన చెందింది. ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి  పోలీసులకు  ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేష్ ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

వేములవాడ లో రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు మోసం చేశాడని (cheating) ఓ యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన (protest) ఘటన బుధవారం చోటు చేసుకుంది.  బాధితురాలి కథనం ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ చెందిన తన మేనబావ ఎదురు గట్ల రాము అదే కాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమి ప్రేమిస్తున్నానని చెప్పాడు.  

"

రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి  చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి  వాపోయింది. తన తల్లి మాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని  గౌతమి ఆవేదన చెందింది. ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి  పోలీసులకు  ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేష్ ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

అయినా  రాము మారకపోవడంతో బుధవారం ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో  ఇంటికి తాళం వేసి తల్లి కొడుకు ఇద్దరూ వెళ్లిపోయారు అని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితులు ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం